More

బ్రిడ్జి డిజైన్‌లో లోపం.. కూల్చేసిన అధికారులు

13 Jul, 2018 11:21 IST

బొగొటా :  10 మంది కార్మికుల మరణానికి కారణమైన నిర్మాణంలో ఉన్న నాసిరకం బ్రిడ్జిని కొలంబియా అధికారులు కూల్చివేశారు. కొలంబియా రాజధాని బొగొటా, విల్లావిసేన్సియో నగరాలను కలిపే హైవేపై చిరజరలోని లోయ పైనుంచి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే  బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో 10 మంది కార్మికులు మృతిచెందారు. డిజైన్‌లో లోపం కారణంగానే బ్రిడ్జి ప్రమాదానికి కారణమైందని తేలడంతో, భద్రతా చర్యల్లో భాగంగా బ్రిడ్జిని కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. 100కిలోల పేలుడు పదార్థాలు, 30 డిటోనేషన్‌ పరికరాలను ఉపయోగించి క్షణాల్లో బ్రిడ్జిని భూస్థాపితం చేశారు. నాసిరకం పనుల కారణంగా ప్రాణ నష్టంతో పాటూ భారీ మొత్తంలో డబ్బు వృథా అయింది. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్దం.. ఐరాసలో భారత్‌ కీలక నిర్ణయం

వీడియో వైరల్‌: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం

Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!

‘అమెరికా’ ఏం చదువుతోంది?

కిరాతకుడికి రష్యా అధ్యక్షుడి క్షమాభిక్ష! సైనికుడిగా ఉక్రెయిన్‌ సరిహద్దుకు..