amp pages | Sakshi

ఈ చిట్కాలేవి కోవిడ్‌ నుంచి రక్షించలేవు!

Published on Sat, 02/15/2020 - 17:09

జెనివా : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రాణాంతక వైరస్‌ ‘కోవిడ్‌–19’ బారిన పడకుండా తప్పించుకోవాలంటే ఒళ్లంతా ఆల్కహాల్‌ పోసుకుంటే సరి అని, అల్లం తింటే అల్లంతా దూరాన ఉంటుందని, ఎలక్ట్రిక్‌ డయ్యర్‌ కింద చేతులు ఆరబెట్టుకున్నా వైరస్‌ హరీమంటుందని, రేడియేషన్‌ను విడుదల చేసే యూవీ లైట్లతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చంటూ సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న చిట్కాలు, పద్ధతులేవీ కోవిడ్‌–19 ముందు పనిచేయవని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం నాడు ఓ ప్రకటనలో తేల్చి చెప్పింది. తప్పుడు సమాచారాన్ని, కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసినట్లయితే కోవిడ్‌ కేసులు మరింత పెరగుతాయంటూ నార్విచ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ పాల్‌ హంటర్‌ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువవడం గమనార్హం. (కోవిడ్‌ : ఫ్రాన్స్‌లో చైనా పర్యాటకుని మృతి)

ఉడకబెట్టిన అల్లం నీళ్లతో వైరస్‌ను అరికట్టవచ్చంటూ ఫేస్‌బుక్‌ షేరింగ్‌ను అడ్డుకున్నారు. అల్లంలో బ్యాక్టీరియాను అరికట్టే కొన్ని గుణాలు ఉన్నప్పటికీ ఈ వైరస్‌ను నిరోధించగలిగే లక్షణాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.నువ్వుల నూనెను ఒళ్లంతా పూసుకోవడం వలన లాభం లేదని, నోటి ద్వారానో, ముక్కు ద్వారానో వైరస్‌ సోకకుండా అది కాపాడలేదని తెలిపింది. కోవిడ్‌ను చంపేసే లక్షణాలు కూడా నువ్వుల నూనెలో లేవని స్పష్టం చేసింది. ఈ ప్రాణాంతక వైరస్‌ ప్రధానంగా వైరస్‌ సోకిన రోగి పక్కనున్నప్పుడు, ఆ రోగి తుమ్మడం వల్ల, దగ్గడం వల్ల వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్