More

45 నిమిషాల పాటు వణికిన పోలీసులు..

8 Feb, 2018 17:24 IST
పొలంలో పడుకున్న పులిని ఫొటో తీసిన పోలీసులు

అబెర్డీన్‌షైర్‌, స్కాట్లాండ్‌ : రాత్రి పూట కావలి కాస్తున్న ఓ పోలీసు టీం 45 నిమిషాల పాటు భయంతో వణికిపోయింది. శనివారం అర్థరాత్రి సమయంలో అబెర్డీన్‌షైర్‌ పట్టణంలోని ఈశాన్య పోలీసు డివిజన్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను ప్రమాదంలో ఉన్నానని, తన పొలంలోకి పెద్దపులి వచ్చిందని వెంటనే వచ్చి రక్షించాలని బాధితుడి ఫోన్‌లో గగ్గోలుపెట్టాడు.

దీంతో హుటాహుటిన వ్యక్తి పొలం వద్దకు చేరుకున్న పోలీసులు రోడ్డుపై పడుకున్న పులిని చూశారు. హఠాత్తుగా పులిని దగ్గరగా చూసిన అధికారులు భయంతో వణికిపోయారు. దాదాపు 45 నిమిషాల పాటు పులి వైపు వెళ్లకుండా నిల్చుండిపోయారు. ఎంతకీ పులి కదలకపోతుండటంతో వారికి అనుమానం కలిగింది. భయంభయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్లగా నిజమైన పులి కాదని తేలింది.

పులి బొమ్మను ఎవరో కావాలని ఇలా రోడ్డుపై పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని తెలిసి నాలుక కరచుకోవడం అధికారుల వంతైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పొలంలో ఉన్న బొమ్మను చూసి నిజమైన పులి అనుకుని రైతు చాలా భయపడిపోయాడని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక

అక్కడ మాత్రం రాక్షసుడే : జెఫ్‌ బెజోస్‌పై ప్రియురాలి వ్యాఖ్యలు

అమెరికాకు అదిరిపోయే కౌంటరిచ్చిన ఉత్తర కొరియా

ప్రపంచవ్యాప్తంగా హమాస్ ఏరివేతకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం!

Video: ఓకే రన్‌వేపై ప్రమాదానికి గురైన రెండు విమానాలు