More

రానాకు శుభాకాంక్షలు తెలిపిన అమితాబ్

14 Dec, 2016 11:09 IST
రానాకు శుభాకాంక్షలు తెలిపిన అమితాబ్

సౌత్తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా. కెరీర్ స్టార్టింగ్ నుంచే బాలీవుడ్ సినిమా మీద దృష్టి పెట్టిన రానా., అమితాబ్ లాంటి టాప్ స్టార్స్తో కలిసి నటించాడు. బాహుబలి సినిమాతో రానా రేంజ్ మరింత ఎత్తుకు చేరింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అక్కడి సినీ ప్రముఖులకూ సుపరిచితుడిగా మారిపొయాడు భల్లాలదేవుడు.

అందుకే ఈ రోజు (బుధవారం) రానా పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు తెలియజేశాడు. డిపార్ట్మెంట్ సినిమా మేకింగ్ సమయంలో రానా కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన బిగ్ బీ.. 'బాహుబలి రానా దగ్గుబాటికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా' అంటూ కామెంట్ చేశారు.

టాలీవుడ్ స్టార్స్ కూడా భల్లాలదేవుడికి తమదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలియజేశారు. 'పెళ్లి ఎప్పుడూ అని అడగలేను గానీ పార్టీ ఎప్పుడు' అని బర్త్ డే విషేస్ తెలిపాడు రామ్. బాలీవుడ్ సినిమా బేబీలో రానాతో కలిసి నటించిన తాప్సీ.. తన కండల అంత పెద్ద హృదయం ఉన్న రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షలని ట్వీట్ చేసింది. వీరితో పాటు సమంత, సుధీర్ బాబు, తమిళ హీరో ఆర్య, రకుల్ ప్రీత్ సింగ్ లు రానాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.శుభాకాంక్షలు తెలిపారు.

 

మరిన్ని వార్తలు :
Tags