More

పవన్, త్రివిక్రమ్ సినిమాలో నాని హీరోయిన్

12 Apr, 2017 13:25 IST

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నాని సరసన హీరోయిన్గా పరిచయం అయిన భామ మెహరీన్. తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ, ఇప్పుడో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్రేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ల సినిమాలో నటించనుంది ఈ బ్యూటి. అయితే మెహరీన్ నటించబోయేది పవన్ సరసన హీరోయిన్గా కాదు. అసలు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలోనే కాదు.

ఇటీవల పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్లు నిర్మాతలుగా నితిన్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించారు. రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మెహరీన్ను హీరోయిన్గా ఫైనల్ చేశారట. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లై' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నితిన్, ఆ తరువాత కృష్ణచైతన్య సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు.

మరిన్ని వార్తలు :
Tags