More

హాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్

17 Nov, 2016 15:33 IST
హాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్

త్వరలో డియర్ జిందగీ, రాయిస్ సినిమాలతో ప్రేక్షకుల  ముందుకు రానున్న షారూఖ్, ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పాడట. హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్, అలెక్సీతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో రణబీర్ కపూర్ కూడా నటిస్తున్నాడు. వీఐవై సీరీస్లో తెరకెక్కిన 'వీఐవై - ఏ జర్నీ టు ది చైనా' సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

దాదాపు 40 మిలియన్ల అమెరికన్ డాలర్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం షారూఖ్, రణబీర్లను జాకీచాన్ స్వయంగా ఎంపిక చేసాడట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీగా తెరకెక్కించి అదే స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags