More

'24' టీజర్ రిలీజ్కు ముహుర్తం కుదిరింది

2 Mar, 2016 10:47 IST
'24' టీజర్ రిలీజ్కు ముహుర్తం కుదిరింది

సౌత్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 24. ఇష్క్, మనం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ మూవీలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు అభిమానులను ఆకట్టుకోగా త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.

తొలి రోజు నుంచి సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న చిత్రయూనిట్ టీజర్ లాంచ్ చేయబోతున్న విషయాన్ని కూడా క్రియేటివ్గా ఎనౌన్స్ చేశారు. సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా జానర్ను రివీల్ చేసే విధంగా సైంటిస్ట్ ఉపయోగించే పరికరాలతో పోస్టర్ను రిలీజ్ చేశారు. మార్చి 4, సాయింత్రం 6గంటలకు టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్తో ఎనౌన్స్ చేశారు.  ఈవిషయాన్ని సూర్య తన ట్విట్టర్లో వెల్లడించారు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 16 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు :
Tags