More

సీనియర్‌ నటుడు చంద్రమౌళి కన్నుమూత

5 Apr, 2018 16:32 IST
చంద్రమౌళి ఫైల్‌ ఫోటో

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు, డబ్బింగ్‌ కళాకారుడు చంద్రమౌళి(57) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగలపాలెంకు చెందిన చంద్రమౌళి 1971లో చంద్రమౌళి చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి చంద్రమౌళికి గురువు. సుమారు 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా, డబ్బింగ్‌ కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

‘అంతా మన మంచికే’ అనే చిత్రంతో చంద్రమౌళి వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు సహా ఇప్పుడున్న అగ్రనటుల సినిమాల్లో కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. రుతురాగాలు సీరియల్‌లో హీరోయిన్‌ తండ్రిపాత్రలో చంద్రమౌళి నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

గిన్నిస్‌ రికార్డు.. సంతోషంలో మునిగి తేలుతోన్న యాంకర్‌ సుమ

విడాకులతో పాటు సినిమా ప్లాపులు ఇలా ఎన్నో నన్ను చుట్టుముట్టాయి: సమంత

మాజీ మిస్‌ ఇండియాను పెళ్లి చేసుకున్న ఉదయ్ కోటక్ కుమారుడు

ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

అమర్‌ దీప్‌కు షాకిచ్చిన బిగ్‌ బాస్‌.. తెలియకుండానే ఏడ్చాను అంటూ..