More

అబూసలేంకు ఏడేళ్ల జైలుశిక్ష

8 Jun, 2018 04:49 IST

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్‌ అబూసలేంకు ఢిల్లీలోని ఓ కోర్టు గురువారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. 2002లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అశోక్‌ గుప్తాను రూ.5 కోట్ల ప్రొటెక్షన్‌ మనీ ఇవ్వాలని బెదిరించిన కేసులో సలేంను కోర్టు మే 26న కోర్టు దోషిగా తేల్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న అదనపు సెషన్స్‌ జడ్జిæ.. సలేంకు ఏడేళ్ల కఠిన కారాగాశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న చంచల్‌ మెహతా, మాజిద్‌ ఖాన్, పవన్, మొహమ్మద్‌ అష్రఫ్‌లను నిర్దోషులుగా విడుదల చేశారు. 1993 ముంబై పేలుళ్ల కేసు సహా పలు నేరాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సలేం నవీముంబైలోని తలోజా జైలులో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

'ఏళ్లుగా సాగతున్న సంప్రదాయానికే కట్టుబడిన రాజస్థాన్‌'! సీఎం ఎవరంటే..?

మార్పుకే జనం ఓటు: బీజేపీ, కాంగ్రెస్‌కు షాకిస్తున్న రెబల్‌ అభ్యర్థి

MP: దూసుకెళ్తున్న ‘మామ’.. బంపర్‌ మెజార్టీలో సీఎం చౌహాన్‌

MP: చారిత్రక విజయం మాదే.. మాజీ సీఎం కోడలు ధీమా

కాంగ్రెస్‌- బీజేపీలతో స్వతంత్ర అభ్యర్థుల ఢీ