More

స్మార్ట్ సిటీలన్నిటా అమెరికా భాగస్వామ్యం!

10 Feb, 2016 01:16 IST

న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు అమెరికా ఆసక్తి వ్యక్తం చేసింది. మూడు స్మార్ట్ సిటీల అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు మొత్తం 100 స్మార్ట్‌సిటీలకూ విస్తరించనున్నట్లు అమెరికా వాణిజ్య ఉప మంత్రి బ్రూస్ ఆండ్రూస్ చెప్పారు.ఈ సిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడి పెట్టడానికి, టెక్నాలజీ అందించటానికి వచ్చిన 18 అమెరికన్ కంపెనీల ప్రతినిధి బృందానికి ఆయన సారథి. విశాఖపట్నం మాస్టర్‌ప్లాన్‌కు సహకరించటంతో పాటు అలహాబాద్, అజ్మీర్‌లకు టెక్నాలజీ అందిస్తున్నట్లు యూఎస్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(యూఎస్‌టీడీఏ) డెరైక్టర్ జాక్ చెప్పారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Election Commission: రూ.1,760 కోట్లు.. ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన మొత్తం

వరల్డ్‌ కప్‌ రాలేదని యువకుడి ఆత్మహత్య

Rajasthan Elections 2023: రాజస్థానీలకు కాంగ్రెస్‌ ఏడు గ్యారంటీలు

ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు ఎన్‌ఐఏ షాక్‌

Rajasthan Elections 2023: ఫేక్‌ అని మహిళలను అవమానిస్తారా?