More

6 నెలల్లో 80 మందిని ఏరేశాం

3 Nov, 2017 12:05 IST

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో 115 మంది ఉగ్రవాదులు రహస్యంగా దాక్కున్నారని ఆర్మీ మేజర్‌ జనరల్‌ బీఎస్‌ రాజు తెలిపారు. పుల్వామా ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ఆయన ఉగ్రవాదులను ఏరేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లో మొత్తం 115 మంది ఉగ్రవాదులు ఉన్నారని.. అందులో 99 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని ఆయన తెలిపారు.

పాకిస్తాన్‌నుంచి ఉగ్రవాదులు దేశంలోరి చొరబడుతున్నారని రాజు తెలిపారు. గత ఆరు నెలల్లో ఇలా చొరబడ్డ, స్థానిక ఉగ్రవాదులతో కలిపి మొత్తం 80 మందిని భద్రతాదళాలు ఏరేశాయని ఆయన తెలిపారు. లోయలోని యువత ఎవరూ పొరపాటున కూడా ఉగ్రవాదులతో కలవద్దని చెప్పారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడియూరప్ప తనయుడు

అలాంటి వీడియోలపై దృష్టి పెట్టాం: కేంద్ర మంత్రి

ప్రైవేట్‌ లాకర్లలో భారీగా బ్లాక్‌ మనీ.. కొనసాగుతున్న సోదాలు

నితీష్‌ ఆహారంలో విషం.. అందుకే ఆయన అలా : మాంజీ

చెత్త కుప్పలో బ్యాగ్‌...తీసి చూస్తే డాలర్ల కట్టలు