More

కార్పెట్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి

23 Feb, 2019 16:50 IST

లక్నో : ఉత్తరప్రదేశ్‌ భడోహి జిల్లాలోని ఓ కార్పెట్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సంభవించిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కార్పెట్‌ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణసంచా తయారు చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. ఈ మధ్యాహ్నం కార్పెట్‌ ఫ్యాక్టరీ లోపల రహస్యంగా బాణాసంచా సామాగ్రి తయారుచేస్తుండగా పేలుడు సంభవించింది. దాంతో ఇంతకు ముందే భవనం లోపల భద్రపరిచిన టపాకాయలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగనట్లు అధికారులు తెలిపారు.

ఈ పేలుడు ధాటికి కార్పెట్‌ ఫ్యాక్టరీ భవనం పేకమేడలా కుప్పకూలి పోగా.. చుట్టుపక్కల ఉన్న మరో మూడు ఇళ్లు కూడా నేలమట్టమైనట్టు తెలిసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

భారత్ ప్రపంచకప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న సీఈఓ

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ కన్నుమూత: పలువురి సంతాపం

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వేళ.. అమెరికా రాయబారి సందడి.. వీడియో ట్రెండింగ్‌!

కెప్టెన్ల ఫోటో షూట్‌: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ రోజున ఉచిత వసతి! ఎక్కడంటే..