More

మోదీ సర్కార్‌పై దీదీ ఫైర్‌

8 Sep, 2017 20:36 IST
మోదీ సర్కార్‌పై దీదీ ఫైర్‌

సాక్షి,కోల్‌కతాః నారదా స్టింగ్‌ కేసులో తృణమూల్‌ నేతలకు సీబీఐ సమన్ల జారీ నేపథ్యంలో కేం‍ద్రంపై ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శల దాడి పెంచారు. బీజేపీ రాజకీయ కక్ష సాధించేందుకు సీబీఐని సాధనంగా వాడుకుంటోందని ఆరోపిం‍చారు. పార్టీ నాయకులను వేధించేందుకే విచారణ చేపట్టారని విమర్శించారు. తృణమూల్‌ కోర్‌ కమిటీ భేటీలో మమతా బెనర్జీ మాట్లాడారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని మమతా బెనర్జీ ఈ సమావేశంలో అన్నట్టు తృణమూల్‌ సీనియర్‌ నేత ఒ‍కరు పేర్కొన్నారు.
 
నారదా స్కామ్‌లో పార్టీ నేతలకు వ్యతిరేకంగా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆమె చెప్పారన్నారు. దుర్గాపూజ, మొహరం సందర్భంగా బీజేపీ మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని దీదీ పార్టీ నేతలకు సూచించారన్నారు.
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Election Commission: రూ.1,760 కోట్లు.. ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన మొత్తం

వరల్డ్‌ కప్‌ రాలేదని యువకుడి ఆత్మహత్య

Rajasthan Elections 2023: రాజస్థానీలకు కాంగ్రెస్‌ ఏడు గ్యారంటీలు

ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు ఎన్‌ఐఏ షాక్‌

Rajasthan Elections 2023: ఫేక్‌ అని మహిళలను అవమానిస్తారా?