More

ఆ సినిమాకు 100 కట్స్ చెప్పారు!

15 Jun, 2016 13:06 IST
ఆ సినిమాకు 100 కట్స్ చెప్పారు!

న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా 'ఉడ్తా పంజాబ్' సెన్సార్ వివాదం కొనసాగుతుండగానే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గుజరాతీ సినిమా 'సాగల్తో సవాల్ అనామత్'కు సెన్సార్ బోర్డు 100 కట్స్ చెప్పడం వివాదంగా మారింది. పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కింది. పటేల్ ఉద్యమ కార్యకర్త హార్దిక్ పటేల్ ను ఇందులో హీరోగా చూపించారు. ఈ పాత్రలో దీపక్ పటేల్ నటించాడు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంబంధించిన అన్ని అంశాలతో పాటు పటీదార్, పటేల్ పదాలను తొలగించాలని  సెన్సార్ బోర్డు సూచించింది. రాజద్రోహం కేసులో ఇరుక్కున్న హార్థిక్ పటేల్ ను సినిమాలో హీరోగా చూపించడం పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని దర్శకుడు రాజేశ్ గొహిల్ వెల్లడించారు. పటేళ్ల ఉద్యమం నేపథ్యంలో తమ సినిమా తెరకెక్కిందన్న వాదనతో వాస్తవం లేదని చెప్పారు. 'పటీదార్' పదాన్ని తొలగిస్తే తాము తీసిన సినిమాకు అర్థం లేకుండా పోతుందని అన్నారు. సెన్సార్ నిర్ణయంతో తమ సినిమా విడుదల ఆలస్యమవుతుందన్నారు. జూన్ 17న ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Dr. Lasya Sai Sindhu: సమస్యను గుర్తించడమే అసలైన మందు

దోచుకున్న డబ్బులో ప్రతి రూపాయి వెనక్కి రప్పిస్తా: మోదీ

అయోధ్య రామాలయం రెడీ

‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసింది.. ఆమె గెలిచి వస్తుంది’

బాస్‌తో నాన్న.. టీచర్‌-పేరెంట్‌ మీటింగ్‌!