More

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధికి కరోనా

22 May, 2020 16:31 IST

ముంబై: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ ఝాకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మధ్యాహ్నం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ‘ఇంతవరకు నాలో కరోనా లక్షణాలు ఏవి కనిపించలేదు. అయినా నాకు కరోనా పాజిటీవ్‌ అని తేలింది. రాబోయే 10-12 రోజులు నేను హోం క్వారంటైన్‌లో ఉండబోతున్నాను. కరోనా వ్యాప్తి లక్షణాలను తక్కువగా అంచనా వేయకండి. మనందరికి కరోనా ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి’ అంటూ సంజయ్‌ ఝా ట్వీట్‌ చేశారు. ఇలా ట్వీట్‌​ చేసిన కొద్ది నిమిషాల్లోనే పలువురు కాంగ్రెస్‌ నాయకులు, బీజేపీ నాయకులు సంజయ్‌ ఝా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రీట్వీట్‌ చేశారు.(కొత్త జంట‌కు షాక్‌: వ‌ధువుకు క‌రోనా)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేరళలో కోవిడ్‌ వేరియంట్‌

కరోనాతో మంచాన పడ్డవారికి... లాంగ్‌ కోవిడ్‌ ముప్పు!

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం

కోవిన్‌ పోర్టల్‌.. ఫుల్‌ సేఫ్‌

COVID-19: ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్‌ కోవిడ్‌