More

పాట రాసిన గవర్నర్

29 Dec, 2015 12:47 IST
పాట రాసిన గవర్నర్

పణజి: స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం గోవా గవర్నర్ మృదులా సిన్హా తట్టా, బుట్టానే కాదు పెన్ను కూడా పట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ఓ పాటను రాశారు. ఇప్పుడు ఆ పాటలోని కొన్ని స్లోగన్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ముద్రిస్తున్నారు.

ఈ పాటలో  పరిశుభ్రతకు సంబంధించి స్లోగన్లతో పాటూ విద్యార్థులతో చేయించే ప్రతిజ్ఞ కూడా ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన ఆవశ్యకతను ఈ పాటలో వివరించారు. పరిశుభ్రంగా ఉండటానికి 'ఏం చేయాలి', 'ఏం చేయకూడదు' లాంటి అంశాలను అందులో ప్రస్తావించారు. కాగా, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రధాని నరేంద్ర మోదీ, మృదులా సిన్హాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

లేడీ యూట్యూబర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్టు

రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా.. నూతన తెలంగాణ భవన్‌

మంటలు రేపిన..మాక్‌ పార్లమెంట్‌!

ఎన్‌ఐఏ చేతికి కర్ణిసేన చీఫ్ హత్య కేసు

Ayodhya Ram Temple: అద్వానీ, జోషిలకు అందిన ఆహ్వానం