More

రిపేర్‌ చేస్తుండగా కదిలిన రైలు.. తప్పిన ప్రమాదం

10 Nov, 2018 15:25 IST

కోల్‌కతా : కోల్‌కతాలోని హౌరా స్టేషన్‌ సమీపంలో ఓ రైల్వే గార్డు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హౌరా-దిగా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లోని ఓ ఏసీ బోగీలో సమస్యతలెత్తడంతో గార్డు అత్యవసరంగా ఏసీ పైప్‌లైన్‌ను రిపేర్‌ చేయసాగాడు. ఇది గమనించని డ్రైవర్‌ ట్రైన్‌ను స్టార్ట్‌ చేశాడు. గార్డు ఇంకా ట్రైన్‌ కిందే ఉన్నాడని అక్కడున్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది గట్టిగా అరవడంతో ప్రయాణికులు చైన్‌ లాగారు. అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న మరో పైపుపై గార్డు కూర్చోవడంతో ప్రమాదం తప్పింది.
 
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రైల్వే అధికారప్రతినిధి సంజయ్‌ గోష్‌ తెలిపారు. డ్రైవర్‌, గార్డుకు మధ్య సమాచార లోపం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

గోవా మంత్రి రాజీనామా.. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన నేతకు అవకాశం

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌: 51 టెంకాయలు ఆర్డర్‌.. ‘ఎక్స్‌’ పోస్ట్‌ వైరల్‌!

గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌: బీజేపీ ట్వీట్‌కు కాంగ్రెస్ రీట్వీట్..!