More

భారతనారి టాలెంట్లో పుల్.. ఆరోగ్యంలో నిల్!

6 Mar, 2015 14:27 IST

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బహుముఖ ప్రజ్ఞ పాటవాలను ప్రదర్శించడంలో భారత నారీమణులు తిరుగులేని వారని ఓ సర్వే తేల్చింది. అయితే, ఆరోగ్యం విషయంలో మాత్రం వారికి పూర్తి అలసత్వం ఉంటుందని కుండబద్దలు కొట్టింది. జీవితా బీమాను అందించే సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ లాంబార్డ్ భారత స్త్రీలపై సర్వే నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. దేశంలో కేవలం 39శాతం స్త్రీలు మాత్రమే జీవిత బీమాను కలిగి ఉన్నారని ఇది ఆందోళనకరమైన విషయమని సర్వే పేర్కొంది.

 

ఏ పనిలోనైనా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించే వీరంతా ఎందుకు ఆరోగ్య బీమా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్దం కావడం లేదని, బహుషా వీరు వివిధ పనుల్లో బిజీ అవడం వల్లే అలా ఆలోచించలేకపోతుండొచ్చని కూడా సర్వే తెలిపింది. గత ఫిబ్రవరిలో ఆన్లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించగా అందులో 16 శాతం మంది మహిళలు అసలు హెల్త్ చెకప్లే చేయించుకోరని, 63 శాతం మంది మాత్రం ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతేనే ఆస్పత్రి ముఖం చూస్తారని పేర్కొంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Uttarakhand: యూసీసీకి సిద్ధం!

సూరత్‌లో ‘దీపావళి ‍ప్రయాణికుల’ తొక్కిసలాట.. పలువురికి అస్వస్థత!

కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి

ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు

దాల్ స‌రస్సులో అగ్నిప్ర‌మాదం.. మంటల్లోకాలి బూడిదైన హౌజ్‌బోట్లు