More

భారీగా మద్యం స్వాధీనం

13 Mar, 2019 12:17 IST

జైపూర్‌ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మద్యం, నగదు పట్టుబడుతున్నాయి. రాజస్ధాన్‌లోని దౌసాకు సమీపంలోని బస్వాలో వాహన తనిఖీల్లో భాగంగా ఓ ట్రక్కులో మద్యం బాటిళ్లతో కూడిన 239 కార్టన్లను బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.

హర్యానా నుంచి దౌసాకు వెళుతున్న ట్రక్‌లో భారీగా మద్యం పట్టుబడటం కలకలం రేపింది. ఎన్నికల సందర్భంగా మద్యాన్ని తరలిస్తున్నారా అనే కోణంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఏప్రిల్‌ 11 నుంచి లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ ప్రారంభం కానుండటం, మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకునే క్రమంలో దేశంలోని పలుచోట్ల భారీగా మద్యం నిల్వలు, నగదు పట్టుబడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Land For Jobs Case: లాలూ, తేజస్వీ యాదవ్‌లకు ఈడీ నోటీసులు

మూడు క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Covid Variant JN.1: కరోనా కొత్త వేరియంట్‌.. 21 కేసులు నమోదు

చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..?

జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి