More

పాస్‌పోర్ట్‌కు ఇక హిందీలోనూ..

23 Apr, 2017 23:37 IST
పాస్‌పోర్ట్‌కు ఇక హిందీలోనూ..

► దరఖాస్తు చేసుకోవచ్చు!
 
న్యూఢిల్లీ: ఇకపై పాస్‌పోర్టు కోసం హిందీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారిక భాషపై పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించడంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంగ్లంతోపాటు హిందీలోనూ దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ శాఖ పేర్కొంది. 2011లో పార్లమెంటరీ సంఘం తొమ్మిదో కమిటీ అధికార భాష హిందీపై పలు సిఫార్సులు చేసి నివేదిక రూపొందించింది. ఇటీవలే ఈ నివేదికను రాష్ట్రపతి  ఆమోదించిన సంగతి తెలిసిందే.

దీంతో అన్ని పాస్‌పోర్టు కార్యాలయాల్లో రెండు భాషలలో దరఖాస్తులను అందుబాటులోకి తీసుకురావాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. అంతేగాక, హిందీలో నింపిన దరఖాస్తును కూడా విదేశాంగ శాఖ ఆమోదించాలని పేర్కొంది. పాస్‌పోర్టులపై కూడా హిందీలో పేర్లను రాయాలని కూడా కమిటీ ప్రతిపాదించింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఇటీవలే ఆమోదముద్ర వేశారు. అంతేగాక దేశ కార్యాలయాలు లేదా విదేశాంగ కార్యాలయాలల్లో హిందీ అధికారి పదవిని సృష్టించేందుకు రాష్ట్రపతి అనుమతిచ్చారు. పాస్‌పోర్టు వెబ్‌సైట్‌ నుంచి హిందీ దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని,  నింపిన తరువాత దరఖాస్తులను తిరిగి వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని విదేశాంగ శాఖ తెలిపింది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో కాకుండా పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయాలలో ఇస్తే  అంగీకరించబోమని విదేశాంగశాఖ స్పష్టంచేసింది. 
 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆగిన టన్నెల్‌ తొలిచే పనులు...ప్రమాదంలో 40 మంది ప్రాణాలు!

కాంగ్రెస్‌ హై కమాండ్‌కు ఏటీంఎంలా రాజస్థాన్‌ : అమిత్‌ షా

ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ చెల్లదు : హర్యానా హై కోర్టు

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరు: ఆనంద్‌ మహీంద్ర వీడియో గూస్‌ బంప్స్‌ ఖాయం!

ఇలా ఎందుకు? అయోమయంలో ఆనంద్‌ మహీంద్ర: ట్వీట్‌ వైరల్‌