More

ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర

11 Oct, 2019 02:46 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. గురువారం లక్ష్మణ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసింది.ఆర్టీసీకి సంబంధించిన పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఉద్యోగులను తొలగిస్తామంటే బీజేపీ చేతులు ముడుచుకొని కూర్చోదన్నారు.రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నారని, వారిని తొలగించకుండా ప్రజాస్వామ్యా న్ని కాపాడే చర్యలు గవర్నర్‌ చేపట్టాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర నేతలు ఇంద్రసేనారెడ్డి, రాంచందర్‌ రావు, వివేక్, జితేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, సాంబమూర్తి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మేఘాకు గ్యారెంటీ పచ్చి అబద్ధం: మంత్రి బుగ్గన

కేసీఆర్‌ చదివిన బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది

ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు..!

Nov 23rd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌