More

గొడవలకు ఆస్కారం.. టీడీపీపై ఫిర్యాదు

18 May, 2019 18:19 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) శనివారం కలిశారు. మంగళగిరి కౌంటింగ్‌లో టీడీపీ గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్నే సీఎం చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నందువల్ల  మంగళగిరిలో కౌంటింగ్‌ సిబ్బందిని కూడా భయపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సీఎం తనయుడు నారా లోకేశే అభ్యర్థి కావడంతో వివాదాలను ప్రోత్సహించి ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉందని ఎన్నికల అధికారికి తెలిపారు. ప్రశాంతంగా కౌంటింగ్‌ జరగాలంటే పోలీస్‌ సిబ్బందిని మంగళగిరిలో అదనంగా నియమించాలని కోరారు. మంగళగిరి కౌంటింగ్‌పై  అదనపు అభ్జర్వర్ని కూడా నియమించాలని విన్నవించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
టీడీపీపై ఎపీ ఈసీసి ఆర్కే ఫిర్యాదు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?