More

గొడుగుతో పాటు ఎగిరిపోయాడు!

29 Mar, 2019 11:00 IST

గాలుల దాటికి ఓ వ్యక్తి గొడుగుతో పాటు ఎగిరిపోయాడు. ఈ ఘటన టర్కీలోని ఒస్మానియా ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా వీడియోలో కనిపించిన వ్యక్తిని సాదిక్‌ కొకడాలిగా గుర్తించారు. ఘటన అనంతరం అతడు మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పాడు. గాలులను తట్టుకుని నిలబడేందుకు స్టాండ్‌ ఉన్న గొడుగు సాయం తీసుకున్న క్రమంలో దాంతో పాటు తాను కూడా పైకి ఎగిరిపోయానన్నాడు. నాలుగు మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత భయంతో కిందకి దూకేశానని తెలిపాడు. ఇక ఈ ఘటనలో కొకడాలికి ఎటువంటి గాయాలు కాకపోవడం విశేషం.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఒకేసారి వంద పచ్చిగుడ్లను తిన్న యూట్యూబర్‌, వీడియో వైరల్‌

వివేక్ రామస్వామి సర్ఫింగ్‌ వీడియో వైరల్‌: నీళ్లలోకి తోసేసి మరీ..!

ఇండియాలో దూసుకుపోతున్న గేమింగ్‌ ఇండస్ట్రీ, 2028 నాటికి..

 ఫ్రీ మీల్స్‌ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?

బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!