More

అగ్రస్థానంలో అథ్లెటిక్స్‌ జట్టు

14 Jun, 2018 10:17 IST

కబడ్డీ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ చాంపియన్‌ షిప్‌లో అథ్లెటిక్స్‌ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అథ్లెటిక్స్‌ జట్టు తొలి స్థానాన్ని దక్కించుకోగా... హాకీ, వాలీబాల్‌ జట్లు వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో అథ్లెటిక్స్‌ జట్టు 42–30తో హాకీపై విజయం సాధించింది.

రైడర్‌ గోపాల్‌ అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. హాకీ జట్టు తరఫున నవీన్‌ రాణించాడు. రెండో మ్యాచ్‌లో అథ్లెటిక్స్‌ జట్టు 36–23తో వాలీబాల్‌ జట్టుపై నెగ్గింది. ఇతర మ్యాచ్‌ల్లో హాకీ జట్టు 49–45తో వాలీబాల్‌ జట్టుపై విజయం సాధించింది. వాలీబాల్‌ టీమ్‌లో రైడర్‌ నరేశ్‌ ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో ‘సాయ్‌’ ఎస్‌టీసీ 20–19తో ఎన్‌ఐఎస్‌ కబడ్డీని ఓడించింది. సాయ్‌ తరఫున సాయి గౌడ్, అంజి... ఎన్‌ఐఎస్‌ జట్టులో సతీశ్, సురేశ్, అలెక్స్‌ ప్రతిభ కనబరిచారు.    

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కోహ్లిలా ఉంటే రోహిత్‌ మరో వరల్డ్‌కప్‌ ఆడతాడు: లంక స్పిన్‌ దిగ్గజం

Ind vs Aus: కేరళలో అడుగుపెట్టిన టీమిండియా.. వీడియో

నో ఛాన్స్‌! అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్‌ ఆల్‌రౌండర్‌ గుడ్‌బై

IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌?!

గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌బై.. ముంబై గూటికి హార్దిక్‌?! మరి రోహిత్‌?