గర్ల్‌ఫ్రెండ్‌తో సందీప్‌ శర్మ నిశ్చితార్థం!

Published on Fri, 06/08/2018 - 17:01

పాటియాలా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సందీప్‌ శర్మ తాజాగా వెల్లడించాడు.  ఈ మేరకు తన కాబోయే భార్య దిగిన ఫొటోను సందీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ పేరు తాషా సాత్విక్‌గా సందీప్‌ తెలిపాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాషా.. తరచుగా సందీప్‌ను అభినందిస్తూ ట్వీట్లు చేస్తుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. గతంలో  కింగ్స్‌ పంజాబ్‌ తరపున సందీప్‌ ఆడే క‍్రమంలో.. తాషా తన ప్రేమను వ్యక్త పరిచినట్లు సమాచారం. అందుకు సందీప్‌ కూడా అంగీకారం తెలపడంతో ఎట్టకేలకు ఈ జంట కలిసి జీవితాన్ని పంచుకునేందుకు మార్గం సుగమైంది. గతేడాది వరకు కింగ్స్ ఎలెవన్ తరఫున సత్తా చాటిన సందీప్ శర్మ.. ఈ సీజన్‌ సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ