More

ట్రంప్‌ను కలిసిన గావస్కర్‌

23 Aug, 2019 16:44 IST

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను క్రికెట్‌ దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ కలిశారు. ఓ చారిటీ ఫౌండేషన్‌ నిధుల సేకరణలో భాగంగా ట్రంప్‌తో గావస్కర్‌ సమావేశమయ్యారు. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధి బారిన పడ్డ చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు ఏర్పాటు చేసేందుకు నిధులు సేకరణలో భాగంగా న్యూయార్క్‌లో ట్రంప్‌ను గావస్కర్‌ కలిశారు. ఈ మేరకు చారిటీ చేసే సేవలను ట్రంప్‌కు తెలిపారు.

ప్రస్తుతం వెస్టిండీస్‌-భారత జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవరిస్తున్న గావస్కర్‌.. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని నిధుల సేకరించేందుకు వినియోగిస్తు‍న్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత ఆపరేషన్స్‌ చేసేందుకు గాను నేవీ ముంబైలోని ఖర్గర్‌లో శ్రీ సాయి సంజీవని ఆస్పత్రితో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటివరకూ న్యూజెర్సీ, అట్లాంటాలతో పాటు పలుచోట్ల గావస్కర్‌ సేకరించిన నిధులతో 230మందికి పైగా పిల్లలకు శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నా ఆటకు పునాది.. సర్వస్వం.. సంతృప్తి ఇక్కడే: కోహ్లి భావోద్వేగం

ఆర్సీబీకి ఆడాలనేది నా కల.. ఇప్పుడిలా: కేఎల్‌ రాహుల్‌

రుతురాజ్‌ స్థానంలో అతడే: బీసీసీఐ.. సర్ఫరాజ్‌కు మొండిచేయి

NZ vs Ban: బంగ్లా సంచలన విజయం.. న్యూజిలాండ్‌ గడ్డపై సరికొత్త చరిత్ర

IPL 2024: ముంబై అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌.. కెప్టెన్‌ దూరం!