More

‘క్రికెటర్లను ఈజీమనీ చెడగొడుతోంది’

24 Aug, 2016 14:25 IST
‘క్రికెటర్లను ఈజీమనీ చెడగొడుతోంది’

చండీగఢ్: ట్వి20 వచ్చిన తర్వాత ఫాస్ట్ బౌలర్లు కష్టపడడం మానేశారని ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్ అన్నాడు. పొట్టి ఫార్మాట్ లో సక్సెస్ కాగానే శ్రమించడం ఆపేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. క్రికెటర్లను ఈజీమనీ చెడగొడుతోందని పేర్కొన్నాడు. డబ్బు మోజులో పడి వర్ధమాన క్రికెటర్లు ఆటను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నాడు. చండీగఢ్ లో పీఏసీ స్టేడియంలోని కోచింగ్ క్లినిక్ లో అండర్-23 పేసర్లకు మెక్గ్రాత్ మెళకువలు నేర్పించాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రికెట్ రాణించాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలని అన్నాడు. సక్సెస్ కావడానికి కష్టపడడం ఒకటే మార్గమని, షార్ట్ కట్స్ లేవని చెప్పాడు. క్రికెటర్లకు ఆటే ముఖ్యమని, తర్వాతే డబ్బు సంపాదన గురించి ఆలోచించాలన్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలని యువక్రికెటర్లకు ఉద్బోధించాడు. పింక్ బంతితో డేనైట్ టెస్టు మ్యాచ్ లు నిర్వహించడం వల్ల క్రికెట్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందని మెక్గ్రాత్ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం