More

భారత్‌లో జూ. హాకీ వరల్డ్ కప్

7 Jun, 2016 23:37 IST

లక్నో: జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. డిసెంబర్ 8 నుంచి 18 వరకు ఈ టోర్నీ లక్నోలో జరగనుంది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రకటించింది. మొత్తం 16 జట్లు పాల్గొనబోతున్న ఈ టోర్నీలో జర్మనీ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. భారత యువ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశమని, టోర్నీని విజయవంతం చేస్తామని హాకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 4 వరకు చిలీలో మహిళల జూనియర్ వరల్డ్‌కప్ జరుగనుండగా ఇందులో భారత్ పోటీపడడం లేదు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం