హైదరాబాద్ : ప్రస్తుత క్రికెట్లో అత్యంత గొప్ప బ్యాట్స్మన్గా ఖ్యాతి గండించిన ఆటగాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లి. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎదురులేని బ్యాట్స్మన్గా ఎదిగిన కోహ్లి పరగుల వరద పారిస్తున్నాడు. ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే కోహ్లి రికార్డులపై ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ కన్నేశాడు. వన్డే క్రికెట్లో కోహ్లిని అందుకుంటానని ఈ ఇంగ్లీష్ బ్యాట్స్మన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎవరు అత్యున్నత శిఖరాలను అవరోధించకూడదని కోరుకుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం వన్డే క్రికెట్లో కోహ్లి అత్యున్నత శిఖరంలో ఉన్నాడని.. ఆ శిఖరాన్ని అందుకోవడమే తన కర్తవ్యమని పేర్కొన్నాడు.
(ధోని లేకుంటే కోహ్లి డమ్మీనే!)
కోహ్లి రికార్డులను అందుకుంటా..
19 Mar, 2019 19:24 IST