More

మరోసారి బంగారు పతకం తెచ్చిన బామ్మ

13 Sep, 2018 18:23 IST

మాలాగా(స్పెయిన్‌): వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో 102 ఏళ్ల వృద్ధురాలు మన్‌ కౌర్‌ భారత్‌కు మరోసారి స్వర్ణం సాధించి పెట్టింది. గతంలో ఆమె 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా స్పెయిన్‌లోని మాలాగాలో జరిగిన చాంపియన్‌షిప్‌లో ఆమె 200 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని విజయం సాధించారు. వరల్డ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ని మాములుగా వయోవృద్ధుల ఒలంపిక్స్‌గా భావిస్తారు. 

కాగా కౌర్‌ సాధించిన విజయం పట్ల నెటిజన్లు సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌ కూడా కౌర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక్కడ విశేషమేమిటంటే సరిగా పదేళ్ల క్రితం వరకు కౌర్‌కు అథ్లెటిక్స్‌కు గురించి అసలు తెలియదు. ఆమెకు 93 ఏళ్ల ఉన్నప్పుడు అథ్లెటిక్స్‌లో ప్రవేశించారు. ఆమె కొడుకు గురుదేవ్‌ సింగ్‌ సూచన మేరకు ఆమె అథ్లెటిక్స్‌పై దృష్టి సారించారు. గురుదేవ్‌ కూడా ఈ గేమ్స్‌లో పాల్గొనడం విశేషం. 

చదవండి: 100 మీటర్ల రేసు విజేత.. 101 ఏళ్ల బామ్మ!

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

శ్రీలంకతో కీలక సమరం.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

శ్రీలంకతో మ్యాచ్‌.. కివీస్‌ను కలవరపెడుతున్న గతం.. మరోవైపు..

వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌.. టాప్‌లో మ్యాక్స్‌వెల్‌, ఆతర్వాత భారత ఆటగాడు

CWC 2023: వరల్డ్‌ ఎలెవెన్‌ జట్టు.. నలుగురు భారత క్రికెటర్లకు చోటు

నెదర్లాండ్స్‌పై విజయం.. ఖుషీలో ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌, ఇంత మాత్రానికేనా..!