More

రోహిత్‌ నమ్మకం వమ్ము కాలేదు..!

23 Dec, 2017 09:50 IST

సాక్షి, ఇండోర్‌: శ్రీలంకతో జరిగిన టీ20లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి కదం తొక్కాడు. తన అద్భుతమైన ఆటతో టి20లో వేగవంతమైన సెంచరీ(35బంతుల్లో) రికార్డును సమం చేశాడు. భారత్‌ 20 ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఇండియాకు టి20లో ఇదే అత్యధిక  స్కోర్‌ కావడం విశేషం. బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక లక్ష్యఛేదనలో తడబడి 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే భారత్‌ 2-0తో సిరిస్‌ను సొంతం చేసుకుంది.

మ్యాచ్‌​అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్‌కు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎలా వచ్చిన బంతిని అలా బాదేశాను. యువ ఆటగాళ్లు చాలా బాగా రాణించారు. యువ బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌, ​చాహల్‌ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శంచారు. వారిద్దరూ కలిసి ఆటను మార్చేశారు. వారిపై నాకు చాలా నమ్మకం ఉంది. ఒత్తిడిని జయించి కూడా బౌలింగ్‌ చేయగలరు’  అని రోహిత్‌ ప్రశంసించారు.

భారత బౌలర్లలో చాహల్‌ నాలుగు వికెట్లు, కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించారు. హార్దిక్‌ పాండ్యా, ఉనాద్కత్‌లకు తలో వికెట్‌ తీశారు. డబుల్‌ సెంచరీ గురించి ఆలోచించడం అత్యాశేనేమో. ఆరంభం నుంచి చివరి వరకు బ్యాటింగ్‌ను కొనసాగించడంలో నాకంటూ ఒక పద్ధతి ఉంది. దానినే ఇక్కడ చూపించాను’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నారు. ఇండియా- శ్రీలంక మధ్య మూడో టి20 ఆదివారం ముంబైలో జరగనుంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ICC ODI World Cup 2023, India vs Netherlands: భారత్‌ 9/9

క్రికెట్‌ చరిత్రలో పెను సంచలనం.. 6 బంతుల్లో 6 వికెట్లు

ప్రపంచ క్రికెట్‌లో రోహిత్ లాంటి ఆటగాడు మరొకరు లేరు: పాక్‌ లెజెండ్‌

భారత్‌- న్యూజిలాండ్‌ సెమీస్‌కు అంపైర్‌లు వీరే.. 2019 వరల్డ్‌కప్‌లో కూడా

న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌.. ముంబైకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్‌