More

‘ఆ బ్యాటింగ్‌ టెక్నిక్‌ అతనికే సొంతం’

6 Sep, 2019 15:41 IST

న్యూఢిల్లీ: యాషెస్‌ సిరీస్‌లో తన బ్యాటింగ్‌ పవర్‌తో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఎంతలా అంటే స్మిత్‌ వికెట్‌  దక్కితే చాలు.. మ్యాచ్‌ గెలిచినట్లేనని ఇంగ్లండ్‌ భావించేంతగా ప్రభావితం చేస్తున్నాడు. అటు ఇంగ్లండ్‌ కోచింగ్‌ సిబ్బందితో పాటు ఫీల్డ్‌లో జో రూట్‌ బృందం ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసినా తన పని తాను పూర్తి చేసిన తర్వాతే స్మిత్‌ పెవిలియన్‌ చేరుతున్నాడు. యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో రెండు భారీ సెంచరీలు, రెండో టెస్టులో 92 పరుగులు, ఇక నాల్గో టెస్టులో డబుల్‌ సెంచరీ ఇలా పరుగుల వరద సృష్టిస్తునే ఉన్నాడు స్మిత్‌. గాయం కారణంగా స్మిత్‌ మూడో టెస్టుకు దూరం కావడంతో దాన్ని ఎలాగోలా ఇంగ్లండ్‌ గెలిచి కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఇప్పుడు మళ్లీ స్మిత్‌ బ్యాటింగ్‌ ఇంగ్లండ్‌కు దడపుట్టిస్తోంది. అసలు ఏ తరహా బంతికి స్మిత్‌ ఔట్‌ అవుతాడో ఇంగ్లండ్‌కు అంతు చిక్కడం లేదు.కాగా, స్మిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎవ్వరికీ అర్థం కాడని అంటున్నాడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. అతని బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఒక వైవిధ్యంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘ స్మిత్‌ది చాలా క్లిష్టమైన బ్యాటింగ్‌ టెక్నిక్‌. అది అతనికి మాత్రమే సొంతం. కాకపోతే  స్మిత్‌ ఆలోచనా విధానం అమోఘం. క్రికెట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపును స్మిత్‌ సాధించడానికి ఇదే కారణం’ అని సచిన్‌ పేర్కొన్నాడు.  స్మిత్‌ తన టెస్టు కెరీర్‌లో 26వ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.  స్మిత్‌ 121 ఇన్నింగ్స్‌లో 26వ సెంచరీని పూర్తి చేయగా, సచిన్‌ 136వ ఇన్నింగ్స్‌లో ఈ మార్కును చేరాడు.(ఇక్కడ చదవండి: ‘స్మిత్‌ టెస్టుల్లోనే మేటి.. మరి కోహ్లి అలా కాదు’)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అభిమానుల అత్యుత్సాహం.. నాడు అలా టీమిండియాకు భంగ‌పాటు!

రోహిత్‌కు ఆఖరి వరల్డ్‌కప్‌.. ఇదే టోర్నీలో విరాట్‌ 50వ వన్డే సెంచరీ కొడతాడు..!

CWC 2023: భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. రేపటి నుంచి టికెట్ల విక్రయం 

సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు