More

భారత్‌ ఖాతాలో మరో పసిడి

11 Apr, 2018 13:08 IST

దూసుకుపోతున్న షూటర్లు

గోల్డ్‌కోస్ట్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మను భాకర్‌... జీతూ రాయ్‌.. హీనా సిద్దూ పసిడి పతకాలు సొంతం చేసుకోగా.. తాజాగా శ్రేయాసి సింగ్‌ భారత్‌కు మరో బంగారు పతకాన్ని అందించింది. మహిళల డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌లో పోటీపడిన శ్రేయాసి.. ఫైనల్లో ఆస్ట్రేలియా ఫేవరేట్‌ ఎమ్మా కాక్స్‌పై గెలిచి ఇండియాకు 12వ గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

2014 లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో సిల్వర్‌ గెలిచిన శ్రేయాసి, ఈసారి స్వర్ణాన్ని ముద్దాడింది. ఇదే ఈవెంట్‌లో మరో ఇండియన్‌ షూటర్‌ వర్ష వర్మన్‌ ఒక్క పాయింట్‌ తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు పురుషుల డబుల్‌ ట్రాప్‌లో భారత్‌కు చెందిన షూటర్‌ అంకుర్‌ మిట్టల్‌కు కాంస్యం దక్కింది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 24 పతకాలతో మూడోస్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

దినేష్‌ కార్తీక్‌ విధ్వంసం.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో! అయినా పాపం

ఐపీఎల్‌-2024 విషయంలో బీసీసీఐకి తలనొప్పులు! కారణాలు?

తొలిసారి భారత జట్టులోకి.. యువ సంచలనంపై అశ్విన్‌ ప్రశంసలు

Vizag: ఐపీఎల్‌ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా! ఇప్పుడు లెజెండ్స్‌ లీగ్‌లో..

ఆడేది 3 మ్యాచ్‌లు మాత్రమే.. 17 మంది ఎందుకు? భారత సెలక్టర్లపై ప్రశ్నల వర్షం