లండన్ : ప్రపంచకప్ అంటేనే క్రికెట్ అభిమానులకు పండగ. 46 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పండగ ఇంగ్లండ్ వేదికగా నేడు ప్రారంభమైంది. ప్రపంచకప్ 2019లో భాగంగా నేడు ఆతిథ్య ఇంగ్లండ్తో దక్షిణాఫ్రికా తలపడుతోంది. అయితే ప్రపంచకప్ ఆరంభపు మ్యాచ్లోనే ప్రొటీస్ సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లా విరాట్ కోహ్లి రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. అంతకుముందు విరాట్ ఈ ఘనతను 175 ఇన్నింగ్స్లో సాధించాడు. ఇప్పటివరకు ఆమ్లా 171 ఇన్నింగ్స్లో 7910 పరుగులు పూర్తి చేశాడు.
చదవండి:
పన్నెండో ప్రపంచ యుద్ధం
ఇమ్రాన్ తాహీర్ నయా రికార్డ్..