టాంటన్ : కేవలం మైదానంలో ఆటతోనే కాకుండా మైదానం బయట తన మంచి మనసుతో హీరో అనిపించుకున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ శతక సహాయంతో ఆసీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అయితే బహుమతి ప్రధానోత్సవం అనంతరం ఆసీస్ అభిమానులకు ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇచ్చాడు. అయితే మ్యాచ్ చూడటానికి వచ్చిన బుల్లి ఆసీస్ క్రికెట్ ఫ్యాన్‌కు ఫిదా అయిన వార్నర్, తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. దీంతో బుడ్డోడితో సహా అక్కడు ఉన్నవారందరూ షాక్‌కు గురయ్యారు. ఇక ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ట్విటర్లో తెలిపింది.
‘ఎంత మంచి వాడవయ్య వార్నర్’
13 Jun, 2019 18:42 IST