More

ఇంట్లోకి చిరుత పిల్ల

5 Jun, 2017 11:23 IST
ఇంట్లోకి చిరుత పిల్ల

తిరువొత్తియూరు: ఇంట్లోకి వచ్చిన ఓ చిరుత పులి పిల్లను అటవీ శాఖా అధికారులు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

వాల్‌పారై, సోలయార్‌ ఎస్టేట్‌ మొదటి డివిజన్‌కు చెందిన తేయాకుతోట కార్మికురాలు ధనలక్ష్మి. శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో ఈమె వంట చేస్తోంది. ఆ సమయంలో వంట గదిలోకి ఓ చిరుత పిల్ల చొరబడింది. పిల్లి అనుకున్న ధనలక్ష్మి వంట చేయడంలో నిమగ్నమైంది. అయితే కొద్ది సమయం తరువాత గర్జన వినపడింది.

దీంతో దిగ్భ్రాంతి చెందిన ధనలక్ష్మి ఇరుగుపొరుగు వారికి పరిస్థితిని తెలిపింది. వీరి ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి, ఉద్యోగులు అక్కడికి చేరుకుని ఆరు నెలల వయసున్న మగ చిరుత పిల్లను పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. బయటకు వెళ్లే సమయంలో ఇళ్ల తలుపులకు గొళ్లెంపెట్టి ఉంచాలని అటవీ శాఖ ఉద్యోగులు ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలు!

ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!

సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం 

గోవా ఆసుపత్రిలో లీకైన ఆక్సిజ‌న్ ట్యాంక్

కరోనా ఆసుపత్రిలో వైద్యుల నృత్యం