More

అంబరాన్నంటిన పూల సంబురం

26 Sep, 2014 03:17 IST
అంబరాన్నంటిన పూల సంబురం

బతుకమ్మ పండుగను మహిళలు రెండోరోజూ ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బతుకమ్మ ఆటల్లో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు.
 
ఒక్కేసి పువ్వేసి.. చందమామ..
 
రాశి పడబోసి చందమామ
రాశి కలుపుదాం రావె చందమామ
రత్నాలగౌరు చందమామ
నీరాశి కలుపుల్లు మేం కొలువమమ్మ
తీగతీగెల బిందె రాగితీగెల బిందె
నీనోము నీకిత్తునే గౌరమ్మ
నానోమునాకీయవే గౌరమ్మ
అదిచూసిమాయన్న గౌరమ్మ
ఏడుమేడలెక్కిరి గౌరమ్మ
ఏడు మేడలమీద పల్లెకోటల మీద
పల్లెకోటల మీద పత్రీలు కోయంగ
దొంగలెవరో దోచిరీ గౌరమ్మ
బంగారు గుండ్లపేరు గౌరమ్మ
దొంగతో దొరలందరూ గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
రెండేసి పూలేసి రాశి పడబోసి గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
మూడేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

 
బతుకమ్మ ఆటపాటలతో పాలమూరు జిల్లా హోరెత్తుతోంది. వేడుకలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తున్నారు. గురువారం రెండోరోజు అటుకుల బతుకమ్మను చేసి సంబురాలు జరిపారు. మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నూ ఉద్యోగినులు బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.     

పూలు సుఖ సంతోషాలకు ప్రతీకలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పూలు సుఖ సంతోషాలకు ప్రతీకల, రకరకాల పూలతో నిర్వహించే బతుకమ్మ పండుగ ఎంతో శక్తితో కూడుకున్నదని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం తీసుకొచ్చిన నిజామాబాద్ ఎంపీ కవిత ముఖ్య అతిథి గా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జేసీ శర్మన్ మా ట్లాడుతూ పెద్దలు అందించిన పూర్వ పండుగలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళలను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏజేసీ రాజారాం పున్న, డీఈఓ చంద్రమోహ న్, ఆర్వీఎం పీఓ కుసుమకుమారి, ఏఎంఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నోటా.. తూటా..! అభ్యర్థులు నచ్చకపోతే దీనికే ఓటా..!?

కాంగ్రెస్‌ చేసేదే చెబుతుంది! : షామ మహమ్మద్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

హిందువులు ఓటుబ్యాంకుగా మారాలి

మొయినాబాద్‌లో రూ.7.5 కోట్లు పట్టివేత