More

ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు

5 Mar, 2019 16:40 IST

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పార్క్‌ స్థలాన్ని కబ్జా చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయవల్సిందిగా ఆదేశించింది. అక్రమ నిర్మాణాలు తొలగించుకున్నామని డీజీపీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇంటి నిర్మాణం కూడా అక్రమమే అని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వివరణ కోరింది. దీంతో రెండు వారాల సమయం కావాలని డీజీపీ ఠాకూర్‌ తరపున న్యాయవాది కోరారు. అయితే సమయం ఇవ్వడం కుదరదన్న న్యాయస్థానం.. ఈ నెల 11వరకు ఇంటి అక్రమ నిర్మాణంపై కౌంటర్‌ దాఖలు చెయ్యాలని ఆదేశించింది.

చదవండి :

ఏపీ డీజీపీ పార్క్‌ భూమిని ఆక్రమించుకున్నారు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాళ్లదాడి.. నారాయణపేటలో ఉద్రిక్తత

రేవంత్‌ గజదొంగ.. నాపై ఒక్క కేసు లేదు: కడియం

TS: పూర్తైన పరిశీలన.. 2,898 నామినేషన్లకు ఆమోదం

ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికే కేసీఆర్‌ పోటీ: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలి: కేసీఆర్‌