More

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జేసీ

12 Jun, 2018 10:33 IST
మొబైల్‌ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న జేసీ నిఖిలారెడ్డి 

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): సదాశివపేట మండల పరిధిలోని నందికంది గ్రామంలో జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మొబైల్‌ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ నిఖిలారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మొబైల్‌ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

నివారణకు అవసరమైన మందులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుందన్నారు. వారానికి మించి దగ్గు, జ్వరం ఉంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు. గ్రామంలోని ప్రజలకు మొబైల్‌ వాహనంలోనే వైద్య పరీక్షలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి రాజేశ్వరి, సర్పంచ్‌ అమృతదేవి, ఎంపీటీసీ సభ్యురాలు జయశ్రీ శ్రీనివాస్‌ తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పరేడ్‌ గ్రౌండ్‌లో మోదీ సభ.. ఈ మార్గాల్లో రాత్రి 8 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

అప్పుడే మొదలైన కుర్చీలాట.. కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం ఎవరు?

తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

కమలంలో కొత్త లొల్లి 

కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు