More

రాష్ట్రంలో డెంగీ మృతులు ఇద్దరే

8 Nov, 2016 02:52 IST
రాష్ట్రంలో డెంగీ మృతులు ఇద్దరే

- అదుపులోనే ఉంది.. ఆందోళన అక్కర్లేదు: మంత్రి లక్ష్మారెడ్డి
- అన్ని రకాల వ్యాధులు ఎదుర్కొనేందుకు సిద్ధం
 
 సాక్షి, హైదరాబాద్: డెంగీ ప్రాణాంతకం కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్, గోవిందాపురం, రావినూతలలో విష జ్వరాల విజృంభణ విచారకరమన్నారు. మరణాలపై ఆడిట్ చేరుుంచామని, ఆ నివేదిక ప్రకారం ఇద్దరు మాత్రమే డెంగీ లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో మృతి చెందారని వెల్లడించారు. కొందరు గుండెపోటు, కిడ్నీ ఫెరుుల్యూర్, వివిధ వ్యాధి లక్షణాలతో మృతి చెందారని, మరికొందరు డెంగీతో చనిపోరుునట్టు అను మానాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ డెంగీ కనిపిస్తున్నా అదుపులోనే ఉందని చెప్పారు.

కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, అనుభవం లేని డాక్టర్లు డెంగీ బూచీతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో డెంగీతో అనేక మంది చనిపోతు న్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. డెంగీ సహా అన్ని రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ వర్షాకాల సీజన్‌లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో డెంగీ లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామన్నారు. జ్వర లక్షణాలున్న ప్రతి ఒక్కరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేరుుంచామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నా పై ఐటీ దాడులు వారి కుట్రే : వివేక్‌

కాంగ్రెస్‌ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నా: కేటీఆర్‌

కేసీఆర్‌ కామారెడ్డి పారిపోయింది అందుకే : భట్టి విక్రమార్క

‘పచ్చ దొంగల ముఠా ఊళ్ళ మీద పడుతోంది జాగ్రత్త’

భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు: సీఎం కేసీఆర్‌