More

ఆస్తి పన్ను చెల్లింపు గడువు పెంపు

24 Apr, 2020 02:53 IST

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్‌ భేటీలో నిర్ణయించిన మేరకు ఆస్తిపన్ను చెల్లింపు గడువును 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలామంది ప్రజలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లింపు గడువు మార్చి 31తో ముగియగా, అపరాధ రుసుం లేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మే 31వరకు గడువు పొడిగిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. జీహెచ్‌ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బండి సంజయ్‌ మార్పుతో బీజేపీ గ్రాఫ్‌ పడిపోయింది: విజయశాంతి

బీఆర్‌ఎస్‌ టైం అయిపోయింది: అమిత్‌ షా

కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా హరీష్‌రావుకు ఉందా?: ఈటల

మునుగోడు జిల్లా ఓట్ల వివ‌రాలు ఇవే.. అలాగే మెజారిటీ ఓట్లు వీరివే..

ప్రచార వాహనంపై స్పృహతప్పిన ఎమ్మెల్సీ కవిత