More

సెవెన్‌.. హెవెన్‌

26 Jul, 2019 00:59 IST
లక్ష్మణ గుండం

మనసు దోచే జలపాతాలు, హృదయం పులకరించే ప్రకృతి సోయగాలు చూడాలంటే ఇకపై మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. దర్జాగా మన గడ్డపైనే వాటిని చూస్తూ తన్మయత్వంతో మైమరచిపోవచ్చు. మదిని కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్న ఈ అందాలు.. మన కుమురంభీం జిల్లాలోనే ఉన్నాయి. లింగాపూర్‌ మండల సమీపంలో ఈ జలపాతాలు హయలొలికిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది. కుమురంభీం జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్‌ చంపాలాల్‌ సందర్శించడంతో మరింత వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరజిల్లాల్సిన ఈ ప్రదేశం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంవల్ల ప్రాచుర్యం సంతరించుకోలేకపోతోంది. ఇవే కాకుండా ఈ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఇన్నాళ్లూ అవి బాహ్య ప్రపంచానికి పరిచయం కాలేదు.    
– ఆకుల రాజు, సాక్షి, ఆసిఫాబాద్‌

సంబంధిత ఫోటోలు
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

హెచ్‌సీఏ వివాదాన్ని పరిష్కరించండి.. హైకోర్టు ఆదేశం​

బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తుది జాబితా విడుదల

కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఆయనకు టికెట్‌.. రమేష్‌ రెడ్డి ఫైర్‌

హ్యాండిచ్చిన కాంగ్రెస్‌.. అద్దంకి దయాకర్‌ రియాక్షన్‌ ఇదే..

తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌