More

అటకెక్కిన ‘సాక్షర భారత్‌’!

31 Jul, 2017 03:41 IST
అటకెక్కిన ‘సాక్షర భారత్‌’!

రెండేళ్లుగా నిధులు విడుదల చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నిలిచిపోయిన కార్యక్రమాలు.. మూతబడుతున్న కేంద్రాలు

సాక్షి, హైదరాబాద్‌: సాక్షర భారత్‌ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రాజెక్టుకు రెండేళ్లుగా నిధులు విడుదల చేయక పోవడంతో అమలు చేయాల్సిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామస్థాయిలో సాక్షర భారత్‌ కేంద్రాలు దాదాపు మూతపడ్డాయి. నిరక్షరా స్యులైన వయోజనులకు కనీస విద్య అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్‌ను 2010లో అమల్లోకి తెచ్చింది. ఇందుకు గ్రామస్థాయి లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటి నిర్వహ ణకు గ్రామ సమన్వయకర్తలను నియమించారు.

రాష్ట్రంలో 443 మండలాల్లో 17,500 కేంద్రాలు ప్రారంభించారు. గ్రామ స్థాయి సమన్వయకర్తలకు రూ.2 వేలు, మండల సమన్వయకర్తలకు రూ.6 వేల గౌరవ వేతనం ప్రక టించారు. ప్రాజెక్టుకు ని ధులు కేటాయించక పోవడంతో అనేక కేంద్రాలకు తాళం పడింది. మండల, గ్రామ సమన్వయకర్తలకు గౌరవ వేతనమూ అందక వారు విధులకు హాజర వడం లేదు.  స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ కూలీల్లో ఎక్కువగా నిరక్షరాస్యులున్నారని, కాబట్టి కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అనుసంధానం చేయాలని సమన్వయకర్తలు కోరు తున్నారు. వేతనాలు, కార్యక్రమం అమలుపై ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేస్తామని, ఆగస్టులో దీనికి కార్యాచరణ ప్రకటిస్తామని గ్రామ సమన్వయకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లు సురేందర్, వెంకటయ్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వారి అవినీతి సంపదను ప్రజలకు పంచుతాం

తెలంగాణలో మార్పు తెస్తాం

ఆయన వెళ్లడానికి రెడీ.. ప్రజలు పంపడానికి రెడీ

Congress manifesto: ధరణి బదులు ‘భూమాత’

TS: టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్‌పై సస్పెన్షన్ వేటు