More

గవర్నర్‌ను కలిసిన వనజీవి రామయ్య

1 Jan, 2020 09:29 IST

సాక్షి, ఖమ్మం: మండలంలోని రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యకు సోమవారం రాత్రి రాజ్‌భవన్‌ నుంచి పిలుపు రావడంతో మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్‌భవన్‌కు రావాలి్సందిగా గవర్నర్‌ తమిళిసై వ్యక్తిగత అధికారులు ఫోన్‌లో రామయ్యకు తెలపడంతో వెళ్లిన రామయ్య గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? అసలు మొక్కలు నాటాలనే ఆలోచన ఎలా వచ్చింది? తదితర వివరాలను గవర్నర్‌ రామయ్యను అడిగి తెలుసుకున్నారు. రామయ్య తాను మొక్కలు నాటడానికి కారణం, ఇంకా వనసంరక్షణ కోసం ఏమేమీ చేస్తున్నానే విషయాలను గవర్నర్‌కు తెలిపారు. జీవిత కాలమంతా మొక్కలు నాటుతూనే ఉంటానని వివరించారు. గవర్నర్‌ రామయ్యకు పూలమొక్కను బహూకరిచారు. గవర్నర్‌ను రామయ్య భార్య జానకమ్మ కలిశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

TS: టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్‌పై సస్పెన్షన్ వేటు

కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ మోసకారి పార్టీ : సీఎం కేసీఆర్‌

కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే