More

ఇప్పటికి 43 టీఎంసీలతో సర్దుకుందాం!

15 Dec, 2016 01:24 IST

రబీ ఆలస్యమవుతున్న దృష్ట్యా తెలంగాణ సూత్రప్రాయ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ప్రాజెక్టుల నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు స్పష్టత ఇవ్వకపోవడంతో రబీ పంటల సాగు ఆలస్యమవుతుండటం, రైతుల నుంచి నీటి విడుదల డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా బోర్డు సూచించిన నిర్ణయానికి కట్టుబడాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు 43 టీఎంసీలు తీసుకునేందుకు బోర్డుకు తన సమ్మతి తెలియజేసినట్లుగా సమాచారం. కాగా, తమకు కేటాయించిన 87 టీఎంసీలు సరిపోవని, 103 టీఎంసీలు కేటాయించాలని బుధవారం బోర్టుకు ఏపీ స్పష్టం చేసినట్లుగా తెలిసింది.

ఇటీవల పట్టిసీమ వినియోగ లెక్కలు, మైనర్‌ కింద వినియోగ లెక్కలను పక్కనబెడుతూ 130 టీఎంసీల లభ్యత జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు ప్రతిపాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన తెలంగాణ, ప్రస్తుతం గత్యంతరం లేని పరిస్థితుల్లో 43 టీఎంసీలు తీసుకోవాలని, ఇంకా అవసరమైతే గవర్నర్‌ సమక్షంలో చర్చించి నిర్ణయానికి రావాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ప్రజాసేవలో డాక్టర్లు..! 

కమల వికాసం.. విలాపం! 

జనసేనకు ఘోర పరాభవం.. అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతు

ఫలితాలపై విస్మయం..

జెయింట్‌ కిల్లర్‌!