More

గూగుల్ లో ఉద్యోగానికి ఏడేళ్ల బాలిక

16 Feb, 2017 18:11 IST
గూగుల్ లో ఉద్యోగానికి ఏడేళ్ల బాలిక

టెక్ ఉత్సాహాకులు ఎక్కువగా ఇష్టపడేది గూగుల్లో ఉద్యోగం చేయడం. కానీ దానిలో జాబ్ కొట్టాలంటే ఎంత కష్టమో. అలాంటి  ఉద్యోగం కోసం ఓ ఏడేళ్ల యూకే బాలిక క్లో బ్రిడ్జ్వాటర్ దరఖాస్తు చేసుకుంది. తనకు గూగుల్లో ఉద్యోగం చేయాలని ఉందని పేర్కొంటూ డైరెక్ట్గా కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్కే అప్లికేషన్ పెట్టుకుంది.  ఆమె ఆసక్తికి మురిసిపోయిన సుందర్ పిచాయ్ ఆ లేఖకు తిరిగి వెంటనే సమాధానం సైతం పంపారు. కష్టపడి చదవి, తన కలలను సాకారం చేసుకోవాలని, స్కూలింగ్ అయిపోగానే వెంటనే అధికారికంగా జాబ్ అప్లికేషన్ పంపించాలని ప్రోత్సహించారు.
 
బిజినెస్ ఇన్సైడర్ రిపోర్టుల ప్రకారం క్లోకు ఇటీవలే ఆదర్శవంతమైన గూగుల్లో పని చేయాలని ఆసక్తి కలిగిందట. గూగుల్లో ఏదో రోజు ఉద్యోగం సంపాదిస్తానని వాళ్ల డాడీకి కూడా తెలిపింది. కూతురి కోరికకు ఎంతో ముచ్చటపడిన క్లో డాడీ బ్రిడ్జ్ వాటర్, ఆమె గూగుల్కు ఉద్యోగ అప్లికేషన్ను పంపేలా సాయపడ్డారు. తనకు కంప్యూటర్లు, రోబోట్స్, టాబ్లెట్స్ అంటే చాలా ఇష్టమని, స్కూల్లో కూడా మంచి విద్యార్థినని పేర్కొంటూ క్లో ఉద్యోగ అప్లికేషన్ను గూగుల్ సీఈవోకు పంపింది. గూగుల్లో వర్క్ చేయడమే కాకుండా, చాకోలెట్ ఫ్యాక్టరీలో పనిచేయడం, ఒలింపిక్స్లో స్విమ్ చేయాలనే ఆసక్తిని పిచాయ్కు రాసిన లేఖలో వెల్లడించింది.
 
ఈ లేఖను అందుకున్న సుందర్ పిచాయ్, వెంటనే తిరిగి సమాధానం పంపారు. గూగుల్లో ఉద్యోగం దరఖాస్తు చేసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతూ, రోబోట్స్, కంప్యూటర్లను ఇష్టపడటం తనకు ఎంతో సంతోషానిచ్చిందన్నారు. టెక్నాలజీ గురించి నీవు మరింత నేర్చుకుంటావని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. క్లో తన డ్రీమ్స్ను చేరుకోవాలని ఆశీర్వదించారు. స్కూలింగ్ పూర్తవగానే గూగుల్లో ఉద్యోగానికి అప్లై చేయమని ప్రోత్సహించారు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..