More

అమర్నాథ్ యాత్ర రెండవ రోజు రద్దు

11 Aug, 2013 11:44 IST

కిష్టవార్ జిల్లాలో మతఘర్షణల నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రెండవ రోజు కూడా రద్దు అయిందని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం జమ్మూలో వెల్లడించారు. అలాగే ఆ యాత్రకు కొత్త బృందాలను ఏవరిని అనుమతించడం లేదని తెలిపారు. దీనితోపాటు పూంచీ జిల్లాలోని మండి పర్వత సానువుల్లోని ప్రముఖ శివ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు చేసే బుద్ద అమరనాథయాత్రను కూడా ఈ రోజు రద్దు చేసినట్లు చెప్పారు.

 

రాజోరి జిల్లాలో ఏర్పాటు చేసిన కర్ఫ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ,కాశ్మీర్లో కిష్టవార్ జిల్లాలో గత రెండు రోజుల క్రితం మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో ఘర్షణలు జరిగే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని సమాచారం అందటంతో ఆ ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం కర్ప్యూ విధించింది. అందులోభాగంగానే శనివారం అమర్యాత్రను రద్దు చేసింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..