More

ఫలితాల్లో సిప్లా సూపర్

8 Feb, 2017 19:07 IST
ఫలితాల్లో సిప్లా సూపర్

ముంబై : దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకులు అంచనాలను బీట్ చేసి మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలను 43.7 శాతం పెంచుకుంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభాలు రూ.375 కోట్లగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.261 కోట్లు మాత్రమే. కంపెనీ కేవలం రూ.370 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని మెజార్టీ విశ్లేషకులు అంచనావేశారు.
 
అదేవిధంగా కంపెనీ నికర అమ్మకాలు కూడా రూ.3550.02 కోట్లకు పెరిగినట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.3069.89 కోట్లగా ఉన్నాయి. కంపెనీ ఆర్జించిన ఇతర ఆదాయాలతో లాభాలు పెరిగాయి.  దేశంలో ఐదవ అతిపెద్ద డ్రగ్ మేకర్గా ఉన్న సిప్లాకు  ఎక్కువ రెవెన్యూలు భారత్ నుంచే వచ్చాయి. ఈ కంపెనీ అమెరికా, యూకేలో కూడా తన ఉనికిని నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 
 
 
 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..