More

భారత్లో నేపాల్ సిమ్ కార్డులు

20 Oct, 2015 12:29 IST
భారత్లో నేపాల్ సిమ్ కార్డులు

నభిడాంగ్(ఉత్తరాఖండ్): భారత్లో నేపాల్ సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా ఇదే వ్యవహారం జరుగుతుంది. నేపాల్ సరిహద్దులోని ఉత్తరాఖండ్కు చెందిన కొన్ని గ్రామాలకు చెందిన స్థానికులతోపాటు ఆఖరికి సరిహద్దు భద్రతా బలగాలు కూడా నేపాల్ సిమ్ కార్డులను ఉపయోగిస్తుండటం గమనార్హం. అదికూడా భరించలేని స్థితిలో ఎక్కువ ధరలకు ఐఎస్డీ కాల్స్ కు చెల్లించే మొత్తంలో చెల్లిస్తు. భారత్కు చెందిన ఏ ప్రైవేటు సంస్థగానీ, ప్రభుత్వ సంస్థగానీ ఆ ప్రాంతాల్లో టెలికం సేవలు అందించకపోవడం ఇందుకు కారణమైంది.

పితోర్ ఘడ్ జిల్లాలోని దార్చులా మండలంలోగల గంజ్, నభితోపాటు పలు గ్రామాల ప్రజలు చాలా ఏళ్లుగా నేపాల్ సిమ్ కార్డులనే ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు కనుచూపు మేరలో కనిపించబోవంటే ఆశ్చర్యపోక తప్పదు.కాగా, తాము ఆ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ను ఏర్పాటుచేశామని అధికారులు చెప్తుండగా టవర్ మాత్రం ఉందికానీ, సిగ్నల్సే కరువయ్యాయని దానికంటే నేపాల్ సిమ్ కార్డులకే తొందరగా సిగ్నల్స్ వస్తున్నాయని అందుకే తాము నేపాల్ సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నామని వారు చెప్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోమౌలిక సదుపాయాలతోపాటు, టెలికం సేవలు విస్తృతం చేస్తామని ఎన్డీయే చేసిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..