More

నిజామబాద్ ఫస్ట్, నల్గొండ సెకండ్

3 Aug, 2015 14:37 IST

కరీంనగర్ : ఈ నెల 15లోగా ఓటర్లందరూ ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ సూచించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వంద శాతం అనుసంధానంతో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, 87 శాతం అనుసంధానంతో నల్గొండ జిల్లా రెండోస్థానం ఉందని తెలిపారు.  ఇక 84 శాతంతో కరీంనగర్ జిల్లా మూడోస్థానంలో నిలిచినట్లు చెప్పారు.

హైదరాబాద్ మినహా తెలంగాణలో 80 శాతం ఆధార్తో అనుసంధానం జరిగిందని భన్వర్లాల్ తెలిపారు. ఆధార్ కార్డు లేనివారి కోసం మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఓటరు గుర్తింపు అడ్రసు, ఆధార్ కార్డు అడ్రస్కు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..